May 19, 2025
WhatsApp Image 2023-02-09 at 5.01.48 PM

RBI గుర్తింపు పొందని ONLINE లోన్ యాప్ ల ద్వారా లోన్ తీసుకోవద్దు

MOBILE HUNT application సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకొని , మిగతా వారికి అవగాహన కల్పించి సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టండి.

సైబర్ క్రైమ్ నివారణే సైబర్ వారోత్సవాల అంతిమ లక్ష్యం.

జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,

  సైబర్ క్రైమ్ నివారణ వారోత్సవాలలో భాగంగా గురువారం నాడు సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు పుత్తూరు డిఎస్పి రామరాజు గారి అధ్యక్షతన, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్ రాజు, ప్రిన్సిపల్ చంద్ర శేఖర్ రెడ్డి వారి సహకారంతో సైబర్ క్రైమ్ ప్రముఖ నిపుణులు శ్రీ ఇ.ఎల్. నరసింహ రావు @cyberpeacengo and @ cyberpeacecorps వారి చేత అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పుత్తూరు డిఎస్పి గారు మాట్లాడుతూ సైబర్ మోసాలు వల్ల మోసపోయిన బాధితులు ఎవరికి, ఎక్కడ చెప్పుకోవాలో  తెలియకుండా మదనపడుతూ, మానసికంగా నలిగిపోతూ, ఆత్మహత్యా ప్రయత్నము కూడా చేస్తున్నారు. అలాంటి వారి కోసమే జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారు ఈ అవగాహన సదస్సులను తిరుపతి జిల్లా వ్యాప్తంగా నిర్వహించి, ప్రజలను చైతన్య వంతులను చేసి, సైబర్ నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళుతున్నామన్నారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోరాదు, కస్టమర్ కేర్ నెంబర్ ను గూగుల్ లో కాకుండా సంభందిత వెబ్ సైట్ లేదా యాప్ లలో మాత్రమే వెతికి సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వకుండా నివారించాలన్నారు.

 తిరుపతి జిల్లా సైబర్ సెల్ సిఐ ఓ.రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ అనవసరంగా యాప్ లను ఇన్స్టాల్ చేసి, మొబైల్ పర్మిషన్ లను యాక్సెస్ ఇవ్వరాదు. తిరుపతి జిల్లాలో మొబైల్ పోగొట్టుకున్న వారు MOBILE HUNT Application సేవలను ఉపయోగించుకోవాలంటే 9490617873 అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా Hai అని మెసేజ్ చేస్తే REPLYగా ఒక గూగుల్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది, తగిన వివరాలతో సహా, తప్పిపోయిన మొబైల్ వివరాలను నింపి సబ్మిట్ చేస్తే, తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసువారు ఆ ఫిర్యాదులను స్వీకరించి పోయిన మొబైల్ ను రికవరీ చేసి వారి స్వస్థలానికి సంబంధించిన పోలీస్ స్టేషన్కు పంపించి బాధితులకు అందజేస్తామన్నారు. ఒకసారి ఈ అప్లికేషన్ ను ఉపయోగించుకున్న వారు 15 రోజుల వరకు పునర్వినియోగానికి అనర్హులు అన్నారు.

  సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గారు మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తర్ఫీదు చేసినప్పుడే సైబర్ నేరాలను నివారించగలుగుతాము.  ఫేస్బుక్ ప్రొఫైల్ను లాక్ చేసి, అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియా లో స్నేహం చేసి, వారితో వీడియో కాల్స్ చెయకూడదన్నారు. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం అంటూ నకిలీ వెబ్ సైట్లు లేదా మరే ఇతర వెబ్ సైట్ అంటూ వచ్చే ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ కు రిప్లై ఇవ్వరాదన్నారు.

సైబర్ క్రైమ్ ప్రముఖ నిపుణులు శ్రీ ఇ.ఎల్. నరసింహ రావు @cyberpeacengo and @ cyberpeacecorps గారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు సైబర్ నేరాలపై సరైన అవగాహన లోపం కారణంగా సులభంగా సైబర్ నేరగాళ్ల చేత మోసపోతున్నారని, ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు జరుగుతున్న తీరుపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా  అవగాహణ సదస్సులను నిర్వహించడం జరిగింది. ఈజీ మనీ కి అలవాటు పడిన కొంత మంది సైబర్ నిపుణులు ఈ సైబర్ నేరాలకు చేస్తూ అమాయక ప్రజలను దోపిడీ చేస్తున్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తన వంతు ప్రేరణగా జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.

     ఈ కార్యక్రమంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ చంద్ర శేఖర్ రెడ్డి, సిఐ లు లక్ష్మీనారాయణ పుత్తూరు టౌన్, సురేష్ కుమార్ పుత్తూరు రూరల్, పుత్తూరు సబ్ డివిజన్ ఎస్ఐలు, సైబర్ ల్యాబ్ సిబ్బంది మరియు సిద్ధార్థ  ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.