సమాజ ప్రశాంతతకు శాంతి భద్రతల పరిరక్షణకు నిదర్శనం పోలీసుల నిబద్ధతే.
నేర నివారణకు ప్రత్యేక శ్రద్ద చాలా అవసరం – ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి
తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ నందు 2 సబ్ డివిజన్ (రేణిగుంట, శ్రీకాళహస్తి) ల పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్., గారు నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
నిబద్ధతతో విధులు నిర్వహించండి.
ఫిర్యాదు దారుల పట్ల మర్యాద తో మెలగండి. వారిని అవమానించవద్దు
మహిళలు, చిన్న పిల్లలకు సంబంధించిన ఫిర్యాదులు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచండి
నేర ప్రవర్తన కలిగిన పాత నేరస్తుల పై ప్రత్యేక దృష్టి సారించి, వారి కదలికలపై నిఘా పెట్టి నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
ప్రతి కేసులో కీలక ఆధారాలను గమనించి, కేసులను త్వరితగతిన చేదించడానికి కృషి చేయాలి
పోలీసులు అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే, శాఖాపరమైన చర్యలు తప్పవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార దుర్వినియోగం చేయకండి
ఆధారాలు లేకుండా అమాయకులను నిర్బంధించకండి
పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కోల్పోయే ఏ పనులు చేయకండి
డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మరింత బాధ్యతతో పని చేయాలి
చెక్ పోస్టులను కీలకమైన ప్రాంతాలలో ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అరికట్టాలి
ఎస్.వో.ఎస్ (పోక్సో యాక్ట్) ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దు
మాదకద్రవ్యాల అమ్మకం, సరఫరా పై ప్రత్యేక నిఘా ఉంచండి