January 29, 2025
WhatsApp Image 2023-08-26 at 13.52.41

డేగ కన్ను లాంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.

ఈనెల 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు  నగరి కు  రాక.

ఎయిర్ పోర్ట్ నందు ముఖ్యమంత్రి గారి భద్రతపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., మరియు జిల్లా కలెక్టర్ శ్రీ కె. వెంకటరమణ రెడ్డి ఐఎఎస్.,

      ఆగస్ట్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు నగరి పర్యటన నేపథ్యంలో శనివారం నాడు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు భద్రతా పరమైన ముందస్తు ఏర్పాట్లపై (ASL) ను జిల్లా ఎస్పీ.శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., గారు, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వెంకటరమణ రెడ్డి ఐఎఎస్., వారు ఇతర శాఖల అధికారులతో  రేణిగుంట ఎయిర్ పోర్ట్  నందు సమీక్ష నిర్వహించి భద్రతా పరమైన అంశాలపై చర్చించారు.

       సమీక్షలో ఉన్నతాధికారులు మాట్లాడుతూ బందోబస్తు పటిష్టంగా ఉండాలని పోలీసులకు సూచనలు చేశారు. అలాగే గౌరవ సీఎం గారు తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గట్టి భద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటల్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

      ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు మాట్లాడుతూ డేగ కన్ను లాంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నాము. పోలీస్ అధికారులు, సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుగు ప్రయాణం అయ్యే వరకూ ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గట్టి బద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయపరచుకుంటూ ప్రణాళికా బద్దంగా, సమిష్టిగా ముందుకు వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేయుటకు విశేష కృషి చేస్తామని అన్నారు.

      ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ కులశేఖర్ శాంతి భద్రత, ఎస్బీ డీఎస్పీ గిరిధర, ఎయిర్ పోర్టు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.